కరీంనగరంలోని రోడ్లు అధ్వానంగా మారాయి. అడుగుకో గుంత ఏర్పడి, కంకర తేలి ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రధానంగా కరీంనగర్ నుంచి జగిత్యాల, సిరిసిల్ల వెళ్లే రహదారులతోపాటు నగరంలోని కోర్టు చౌరస్తా – వావిలాల పల్లి రోడ్డు, సుభాష్‌నగర్, బోయవాడ వెళ్లే మార్గాలు, జ్యోతినగర్‌లోని కోర్టు వెనుక భాగంలో, రామడుగు మండలం వెలిచాల ఎక్స్ రోడ్ వద్ద రోడ్లు ఛిద్రమయ్యాయి. ఇదిగాక ఇటీవలి వర్షాలకు బురదమయమై ఆనవాళ్లు కోల్పోగా, మరమ్మతులపై పట్టని అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.