Dharmaram | ధర్మారం, సెప్టెంబర్ 7 : అసెంబ్లీలోకి ప్రవేశించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో సోమవారం పార్టీ నాయకులు చేశారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపుమేరకు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలోని కరీంనగర్ – రాయపట్నం రహదారిపై రాస్తారోకో నిర్వహించి తీవ్ర నిరసన తెలిపారు. మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా సబితా ఇంద్రారెడ్డి ని మెడ పట్టి పోలీసులు దౌర్జన్యంగా నెట్టి వేయడాన్ని ఈ సందర్భంగా వారు తీవ్రంగా ఖండించారు.
సందర్భంగా పార్టీ మండల నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజలకు ఇచ్చిన హామీలను అసెంబ్లీలో నిలదీస్తారనే భయంతోనే ఖాకీలను అడ్డుపెట్టి హాజరుకాకుండా అడ్డుకొని అరెస్టు చేశారని వారు ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా సీఎం రేవంత్ రెడ్డి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మాజీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, ఏఎంసీ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, పార్టీ ధర్మారం పట్టణ మాజీ అధ్యక్షుడు తుమ్మల రాంబాబు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కోమటిరెడ్డి మల్లారెడ్డి, నాయకులు మిట్ట తిరుపతి, ఎగ్గేల స్వామి, కారుపాకల రాజయ్య ,కూరపాటి శ్రీనివాస్, గాజుల రాజు, దేవి రాజేందర్, దేవి అజయ్,అమరపల్లి నారాయణ, కల్లేపల్లి లింగయ్య, గంధం తిరుపతి, గుజ్జేటి కనకలక్ష్మి,వేల్పుల కుమార్ పాల్గొన్నారు.