Godavarikhnai | ఫర్టిలైజర్ సిటీ, ఏప్రిల్ 4 : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
సహా ఉద్యోగి పదవి విరమణ వేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణంలో…ఇంటికి వెళ్తున్న క్రమంలో కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని సింగరేణి ఉద్యోగి వేల్పుల శ్రీధర్ (40) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు సింగరేణి ఉద్యోగులు తీవ్రం గా గాయపడ్డ సంఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది .
స్థానికులు ,మృతుని బంధువుల కథనం ప్రకారం.. జక్కుల సమ్మయ్య అనే సింగరేణి ఉద్యోగి పదవీ విరమణ కార్యక్రమం శుక్రవారం స్థానిక ఆర్ సి ఓ ఏ క్లబ్ లో నిర్వహించగా .. జీడీకే 1 ఇంక్లైన్ లో పనిచేసే సింగరేణి ఉద్యోగి మాలోత్ శ్రీకాంత్ కారులో అదే గని లో పనిచేసే తడకల మహేందర్, ఎన్ .లక్ష్మణ్ తో పాటు అదే గని లో గతం లో పని చేసి ఇటీవలే జీడీకే 11 ఇంక్లైన్ కు బదిలీ అయిన సర్వే చైన్ మాన్ గా పని చేసే మార్కండేయ కాలనీ కి చెందిన ఏల్పుల శ్రీధర్ (40) వెళ్ళి తిరిగి వస్తున్న క్రమం లో రాజేష్ థియేటర్ నుంచి మున్సిపల్ కార్యాలయ మెయిన్ రోడ్ కు వస్తున్న క్రమ లో అతివేగం కార్ వచ్చి టర్నింగ్ పై ఉన్న డివైడర్ ను ఢీకొట్టి ..పక్కనే ఉన్న సిమెంట్ షాప్ కు, అక్కడే ఉన్న చెట్టుకు, అనంతరం పొడవాటి సిమెంట్ విద్యుత్ పోలు ను ఢీకొట్టడం తో కార్ వెనకాల కూర్చున్న ఎల్పుల శ్రీధర్ (40) అక్కడికక్కడే మృతి చెందగా కార్ నడుపుతున్న శ్రీకాంత్ తో పాటు కారు లో ఉన్న మహేందర్, లక్ష్మణ్ లు గాయాల పాలయ్యారు. స్థానికుల సమాచారం తో ప్రైవేట్ అంబులెన్సు లో పోలీస్ లు ఈ ముగ్గురిని కరీంనగర్ లో ని వేర్వేరు ప్రైవేట్ ఆసుపత్రికి మెరుగైన చికిత్స నిమిత్తం తరలించగా లక్ష్మణ్ పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్లు తెలిసింది.
ఆసుపత్రిలో మిన్నంటిన రోదనలు..
అనుకోని రోడ్ ప్రమాదం లో శ్రీధర్ అనే సింగరేణి ఉద్యోగి మృతి చెందటం తో ఆసుపత్రి లో భార్య రోజారాణి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. 8 నెలల పాపా, 3 సంవత్సరాల బాబుతో రోజారాణి భర్త మృతదేహం పై పడి గుండెల విసేలా రోదించడం అందరినీ కలిచి వేసింది. శ్రీధర్ తన తండ్రి ఉద్యోగం వారసత్వం గా రావటం తో 9 సంవత్సరాల క్రితం మొదట జీడీకే 2 ఇంక్లైన్ లో ఉద్యోగంలో చేరి ,అనంతరం పదోన్నతి పై జీడీకే 1 ఇంక్లైన్, అక్కడినుంచి జీడీకే 11 ఇంక్లైన్ కు బదిలీ అయ్యాడు.
అంతర్గత రోడ్ లలోనే ప్రమాదాలు.
గోదావరిఖనికి పట్టణం లో అతివేగం తో అర్ధరాత్రి దాటిన తర్వాత జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు పలువురిని కలవర పెడుతున్నాయి. గతం లో ఎమ్ ఎల్ ఏ క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన కార్ ఆగి ఉన్న లారీ ని ఢీకొట్ట డం తో కార్ లో ప్రయాణిస్తున్న సతీష్ అనే అనే సింగరేణి ఉద్యోగి తో పాటు అతని చిన్న కుమారుడు మృత్యువాత పడ్డారు. అంతేకాక పట్టణం లో ని జ్యోతినగర్ లో విద్యుత్తు పోల్ ని ఢీకొట్టడం తో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి, తిలక్ నగర్ లో బైక్ పై వస్తున్న ముగ్గురు షట్టర్ ను ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడ మృతి చెందారు. ఓ వైపు పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకై అరైస్-అలైవ్ పేరు తో 3 విడతల అవగాహన కార్య క్రమాలు చేపడుతున్న ఈ ప్రమాదాలు మాత్రం ఆగడం లేదు.