Road Accident | ఓదెల, జనవరి 17 : ఆటో-ట్రాలీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గుంపుల గ్రామంలో మూలమలుపు వద్ద శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జమ్మికుంట నుండి స్వగ్రామానికి వెళ్తున్న కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామానికి చెందిన సల్పాల బాలకృష్ణ (40) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
రోడ్డు మూలమలుపు వద్ద ఎదురెదురుగా బైకు, ఆటో ట్రాలీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగి వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కాగా ఘటన స్థలానికి పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ గౌడ్ వెళ్లి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.