పెగడపల్లి, ఆగస్టు 1 : సివిల్ సైప్లె అధికారుల ఫిర్యాదు మేరకు పెగడపల్లి శివారులోని హరిహర మోడ్రన్ రైస్‌మిల్ యజమానిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ రఘు చందర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. హరిహర రైస్‌మిల్ యజమాని గంగం వెంకట్‌రెడ్డి ధాన్యం పట్టి సివిల్ సైప్లె కార్పొరేషన్‌కు అప్పగించేందుకు 2022-23 సంవత్సరానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఈ మేరకు సివిల్ సైప్లె కార్పొరేషన్ నుంచి 3 కోట్ల 10 లక్షల విలువైన 12,728 క్వింటాళ్ల ధాన్యం తీసుకొని సీఎంఆర్ బియ్యంగా మార్చి ఇవ్వాల్సి ఉంది. అయితే, వెంకట్‌రెడ్డి అక్రమాలకు పాల్పడి మోసం చేశాడని సివిల్ సైప్లె కార్పొరేషన్ జిల్లా మేనేజర్ హథిరామ్ ఫిర్యాదు మేరకు పెగడపల్లి ఎస్ఐ రవికిరణ్ కేసు నమోదు చేశారు. దర్యాపు అనంతరం గురువారం రిమాండ్‌కు తరలించారు.