Revenue conferences | పెద్దపల్లి రూరల్, జూన్ 3 : చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న భూమి హక్కుల సమస్యలను పరిష్కరించేందుకే భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు అన్నారు. పెద్దపల్లి మండలంలోని రంగాపూర్ , భోజన్నపేట గ్రామాల్లో భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. భోజన్నపేటలో నిర్వహిస్తున్న సదస్సుకు జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు, పెద్దపల్లి ఆర్డీవో బొద్దుల గంగయ్యతో కలిసి సందర్శించి సదస్సు నడుస్తున్న తీరును, వచ్చిన ధరఖాస్తులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు, రైతులు ఎవరైనా సరే భూములకు సంబంధించిన హక్కుల విషయంలో పడుతున్న బాధరపై ఆధారాలతో కూడిన దరఖాస్తులను సమర్పిస్తే అవసరమైన చర్యలు తీసుకుంటూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పూర్తి స్థాయి హక్కులు కల్పించనున్నట్లు తెలిపారు.
ఈ అవకాశాన్ని జిల్లాలోని అన్ని మండలాల రైతులు, ప్రజలు వినియోగించుకుని లబ్ధి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి తహసీల్దార్ దండిగ రాజయ్య యాదవ్, నాయిబ్ తహసీల్దార్ విజేందర్, ఆర్ఐలు భానుకుమార్, వెంకటరాజిరెడ్డితో పాటు అధికారుల బృందం పాల్గొన్నారు.