Vemulawada | రేవంత్ రెడ్డి ఇదిగో మా రక్తం తీసుకో.. రైతన్నకు సాగునీరు ఇవ్వు.. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చల్మెడ లక్ష్మీనరసింహారావు
ఇదిగో మా రక్తం తీసుకో.. కానీ రైతుకు కనీసం సాగునీరు ఇవ్వు’ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చల్మెడ లక్ష్మీనరసింహారావు సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. వేములవాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా చల్మెడ నివాసంలో దాదాపు 25 మంది పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన మంగళవారం రక్తం దానం చేసి మాట్లాడారు.

Vemulawada | వేములవాడ, జూలై 14: ‘ఇదిగో మా రక్తం తీసుకో.. కానీ రైతుకు కనీసం సాగునీరు ఇవ్వు’ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చల్మెడ లక్ష్మీనరసింహారావు సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. వేములవాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా చల్మెడ నివాసంలో దాదాపు 25 మంది పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన మంగళవారం రక్తం దానం చేసి మాట్లాడారు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న తీరును ప్రశ్నిస్తే ప్రతిపక్షాల నాయకులు కేటీఆర్, హరీష్ రావును కోసి రక్తం చల్లితే అదే పండుతుందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు గర్హనీయమని అన్నారు. కండ్ల ముందే ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఎండిపోతున్న సీఎం రేవంత్ రెడ్డి రైతన్నలకు నీళ్లు ఇవ్వడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని అడిగితే మిమ్మల్ని కోసి మీ రక్తాన్ని పంటల మీదే చల్లితే పంటలు పండుతాయి అని రైతులను కించపరిచే విధంగా మాట్లాడడం సీఎం స్థాయికి సిగ్గుచేటని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వేములవాడ పట్టణములోని చల్మెడ నివాసంలో ‘రేవంత్‌రెడ్డికి రక్తదానం’ పేరిట శిబిరం ఏర్పాటు చేసి నాయకులతో కలిసి రక్తదానం చేసి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా మంత్రి పదవి కోసం, స్థాయిని మరిచి మాటలు మాట్లాడుతూ ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టడంలో విఫలమవుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం నీళ్లను వెంటనే రైతన్న పంటపొలాలకు మళ్లించేలా చర్యలు తీసుకోకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేపడతామని ఆయన హెచ్చరించారు. దాదాపు 25 మందికి పైగా రక్తదానం చేసి మా రక్తం తీసుకో ..రైతన్నకు నీళ్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో సీనియర్ కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ ఏనుగు తిరుపతి రెడ్డి, సీనియర్ నాయకులు రామతీర్థపు రాజు, వెంగళ శ్రీకాంత్ గౌడ్, వాసాల శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, సిరిగిరి రామచందర్, జోగిని శంకర్, నాయకులు క్రాంతి కుమార్, గూడూరు మధు, సుంకపాక రాజు, నరాల దేవేందర్, కొండ నరసయ్య, అంజద్ పాషా, నీరటి మల్లేశం, రాపల్లి రాంబాబు, రేగుల రాజేశం, జంగిటి సంజీవ్, నిమ్మశేట్టి రాజు, మామిండ్ల కనకయ్య, పెద్దిరాజు, మంత సందీప్, పబ్బ మహేష్, గోసుకుల నరసయ్య, హనుమంతు, ఉమర్, రఫిక్, ప్రేమ్ చారి, దేవరాజు, నాగుల రాము, మిరియాల సంతోష్, సాయి పటేల్, అసద్, బత్తుల మహేందర్, మండల నాయకులు మల్యాల దేవయ్య, గోపు పరశురాములు, పసుల అంజి, నూకలమర్రి సర్పంచ్ నరేష్, గోపు మధు, గుండెకార్ల నరేష్, బండారి శ్రీనివాస్, రాము గౌడ్, జింక శ్రీధర్, జనార్ధన్, పెండ్యాల శంకర్, సాయి, గడ్డం నరేష్, తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్‌లో సీఈపై సస్పెన్షన్ వేటు.. రద్దు చేయాలని ఉద్యోగుల జేఏసీ వినతి
Congress | కాంగ్రెస్ నేత దౌర్జన్యం.. సంక్షేమ సంఘం కార్యదర్శిపై బూతుపురాణం
Smriti Mandhana | మంధాన శకంలో మొదటి అంకం.. నేడు జింబాబ్వేతో భారత్ తొలి టీ20
Jio Internet | జియోతో ఇంటర్నెట్ చౌక.. 6G సేవలపై ఎండీ ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
Palamuru | నీళ్లెత్తేందుకు ఎందుకిన్ని డ్రామాలు.. విడుదల చేసిన నీళ్లు బీర్ల తయారీ కోసమా .. పొలాలకా!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

