Korukanti Chander | రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న రేవంత్ సర్కార్.. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
పదేళ్ల కేసీఆర్ పాలన యావత్ తెలంగాణ రైతాంగం రాజులుగా దర్జాగా బతికారని, రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో రైతుల జీవితాలను అగమాగమయ్యాయని రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.
- కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు ఆగమాగం
- వరి ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలి
Korukanti Chander | అంతర్గాం, మే 16 : పదేళ్ల కేసీఆర్ పాలన యావత్ తెలంగాణ రైతాంగం రాజులుగా దర్జాగా బతికారని, రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో రైతుల జీవితాలను అగమాగమయ్యాయని రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ‘దోచుకో.. దాచుకో..’ అనే నినాదం తప్ప, రైతులను ఆదు కునే ధ్యాసే లేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం చేసిన జాప్యం ఇప్పుడు, రైతుల పాలిటశాపంగా మారిందని మండి పడ్డారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రైతుల అంతా సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ పాలనలో రైతుల కళ్ళల్లో కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ హయాంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిందని, సకాలంలో ఎరువుల పంపిణీ, రైతుబంధు, ధాన్యం కొనుగోలు చేసి నేరుగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసినట్లు గుర్తుచేశారు. 20 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉండటంతో ఇటీవల అకాల వర్షాలు కురిసి ధాన్యం తడిసి రైతులకు ఇబ్బందులు అయ్యాయని అన్నారు. ధాన్యం బస్తాల్లో కోతలు విధించడంతో రైతుకు ఆర్థికంగా నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్రం ప్రభుత్వం వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాలో డబ్బులు జామ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

