Chigurumamidi | చిగురుమామిడి, జూన్ 16 : చిగురుమామిడి మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు దేవసాని శ్రీనివాస్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి రిటైర్డ్ తహసీల్దార్ దేవసాని గణపతి రెడ్డి అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. మరణ వార్త తెలిసిన వెంటనే బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు పిల్లి వేణు, మండల నాయకులు అనుమాండ్ల సత్యనారాయణ, కూతురు శరభంద రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఆగయ్య, కృష్ణారెడ్డి, శ్రీనివాస్, రవీందర్, శ్రీకాంత్, రాజయ్య మృతదేహం వద్ద నివాళులర్పించారు. బీఆర్ఎస్ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.