Retired employees | వేములవాడ, జనవరి 5: ప్రభుత్వపరమైన సేవలు అందించి చేసిన సేవలకు రావాల్సిన ప్రభుత్వ బకాయిలను చెల్లించకుండా ప్రజా పాలనలో దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతూ వేధిస్తున్న తీరుపై ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ కన్వీనర్ జలపాల వెంకటయ్య మండిపడ్డారు.
ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు ఇవ్వకపోవడంతో అనేకమంది ఉద్యోగుల కుటుంబాలు మానసిక వేదనలో ఉన్నాయని తెలిపారు. చివరికి ప్రభుత్వం నుండి తమకు న్యాయబద్ధంగా రావలసిన బకాయిల కోసం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీనిని కూడా అడ్డుకొని పోలీసుల ద్వారా నిర్భందించడం దుర్మార్గమైన చర్య అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమకు రావలసిన బకాయిలను వెంటనే విడుదల చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఆయన మండిపడ్డారు. ఇక్కడ రిటైర్డ్ ఉద్యోగులు తిరుపతి, ధర్మయ్య ఉన్నారు.