కొత్తపల్లి, ఆగస్టు 25 : కరీంనగర్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపిక పోటీలకు క్రీడాకారుల నుంచి విశేష స్పందన లభించింది. పలు ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరు కాగా పోటీలను అసోసియేషన్ చైర్మన్, అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బుర్ర మధుసూదన్‌రెడ్డి, సురభి వేణుగోపాల్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ సైక్లింగ్ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు కృషిచేసిన వారమవుతామన్నారు.
సైక్లింగ్‌కు కరీంనగర్లో మంచి ఆదరణ ఉందని, క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గతంలో రెండుసార్లు రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలను ఇక్కడ నిర్వహించినట్లు గుర్తు చేశారు. అనంతరం పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులను రాష్ట్ర పోటీలకు ఎంపిక చేశారు.
అండర్-14 బాలుర విభాగంలో వీ గౌతమ్, ఎం నాగసాయి, వీ నేహార్, కే అనిరుద్, పీ శ్రేష్, బీ అక్షయ్ ఎంపిక కాగా, అండర్-16 విభాగంలో ఎస్ ఆర్ లికిల్, అనిష్, అండర్-18 విభాగంలో హృతికేశ్, నిషద్జ్, జే సంజన్ అదిత్య, అండర్-23 పై విభాగంలో వీ వేణుగోపాల్, రెహన్, కోటేశ్వర్రావు, అఖిల్, సీ అశోక్ కూమార్ ఎంపికయ్యారు. ఈ పోటీల్లో సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా బాధ్యులు ఎన్ వేణుగోపాల్, ఇనుగుర్తి రమేశ్, అరవింద్ బాబు, ఆన్వేశ్, కోచ్‌లు తదితరులు పాల్గొన్నారు.