కమాన్‌చౌరస్తా, ఏప్రిల్ 22 : కరీంనగర్ కోటా ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెజోనెన్స్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటారని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ డీ అంజిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అతి తకువ మంది విద్యార్థులతో రాష్ట్ర స్థాయి మారులు, అత్యధిక పాస్ పర్సంటేజ్‌తో చరిత్ర సృష్టించడం తమకు గర్వ కారణంగా ఉందన్నారు.
ఎంపీసీ విభాగంలో కళాశాల చెందిన టీ భావన, జీ సాయి అక్షిత్, కే సహన శ్రీ, యూ అహన్య, ఎంన్ శ్రీ అక్షిత, పీ సంజన 467 మారులు సాధించారన్నారు. అలాగే కే కీర్తన, ఎం అక్షయ, కే అక్షయ్ వర్ధన్, బీ సహస్ర శ్రీ, టీ విజయ్ వర్ధన్, ఎం నివ్య రెడ్డి, కే సాత్విక్, సీహెచ్ హస్య రెడ్డి 466 మారులు పొందారన్నారు. అలాగే, 465 మారులు ఏడుగురు, 464 మారులు పది మంది విద్యార్థులు సాధించారన్నారు.
కళాశాలకు చెందిన 62 మంది విద్యార్థులు 460 పైగా మారులు సాధించడం సంతోషంగా ఉన్నదన్నారు. అలాగే, బైపీసీ విభాగంలో ఎం శ్రీష 436, బీ సాయి త్రిపుర 435, వై వంశీక, ఏ సంజనా నాయక్, ఎం తేజస్వి 432 మారులతో పాటు ఎనిమిది మంది 430 ఆ పైన మారులు సాధించారన్నారు. ద్వితీయ సంవత్సరంలో రాష్ట్ర స్థాయిలో ఎం శ్రినిత, ఎస్ శృతి 987 మారులతో పాటు ఆరుగురు విద్యార్థులు 980 ఆ పైన మారులు పొందారని చెప్పారు. కళాశాలకు చెందిన విద్యార్థులు 92 శాతం పాస్ పర్సంటేజ్ సాధించి, కరీంనగర్ జిల్లాలోనే అత్యధిక పాస్ పర్సెంటేజ్ సాధించిన ఏకైక విద్యాసంస్థగా నిలిచిందని వివరించారు.