Peddapally | పెద్దపల్లి, జనవరి 17(నమస్తే తెలంగాణ): పురపాలక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇందుకు గాను ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన ఓటరు లిస్టు తుది జాబితాలను ప్రకటించగా శనివారం కార్పోరేషన్లు, కార్పొరేషన్ల పరిధిలోని డివిజన్లు, మున్సిపాల్టీలు, మున్సిపాల్టీల పరిధిలోని వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లను సైతం ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా పరిధిలోని రామగుండం కార్పోరేషన్ మరో మారు ఎస్సీ జనరల్‌కు కేటాయించగా.. మంథని, పెద్దపల్లి మున్సిపాల్టీలను బీసీ జనరల్‌కు, సుల్తానాబాద్ మున్సిపాల్టీని జనరల్‌కు కేటాయించారు.
రామగుండం నగరపాలక సంస్థ, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌ల పరిధిలోని వార్డులను, రామగుండం కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ల రిజర్వేషన్లను జిల్లా ఎన్నికల అధికారి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ జల్ద అరుణశ్రీల రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో ఖరారు చేశారు.
రామగుండం కార్పొరేషన్లో డివిజన్ల వారీగా రిజర్వేషన్లు ఇవే..
రామగుండం కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని ఎస్సీ జనరల్‌కు కేటాయించగా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని 60డివిజన్లకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేశారు. క్కడ 1వ డివిజన్ జనరల్ మహిళ, 2,3వ డివిజన్లు జనరల్‌కు, 4వ డివిజన్ జనరల్ మహిళకు, 5వ డివిజన్ జనరల్‌కు, 6వ డివిజన్ ఎస్సీ మహిళ, 7వ డివిజన్ జనరల్ మహిళ, 8వ డివిజన్ ఎస్సీ మహిళ, 9వ డివిజన్ ఎస్సీ మహిళ, 10వ డివిజన్ బీసీ జనరల్, 11వ డివిజన్ ఎస్సీ మహిళ, 12వ డివిజన్ బీసీ జనరల్, 13వ డివిజన్ బీసీ మహిళ, 14వ డివిజన్ ఎస్టీ జనరల్, 15, 16, 17వ డివిజన్లు జనరల్ మహిళకు, 18వ డివిజన్ జనరల్, 19వ డివిజన్ జనరల్ మహిళ, 20వ డివిజన్ జనరల్, 21వ డివిజన్జనరల్ మహిళ, 22వ డివిజన్ ఎస్సీ మహిళ, 23వ డివిజన్ జనరల్, 24వ డివిజన్ జనరల్ మహిళ, 25వ డివిజన్ జనరల్, 26వ డివిజన్ జనరల్ మహిళ, 27వ డివిజన్ బీసీ మహిళ, 28వ డివిజన్ బీసీ జనరల్, 29వ డివిజన్ జనరల్ మహిళ, 30వ డివిజన్ బీసీ జనరల్, 31, 32వ డివిజన్లు జనరల్ మహిళకు, 33వ డివిజన్ ఎస్సీ జనరల్, 34వ డివిజన్జనరల్ మహిళకు, 35వ డివిజన్ బీసీ మహిళకు, 36వ డివిజన్ ఎస్సీ మహిళకు, 37వ డివిజన్ జనరల్, 38వ డివిజన్ ఎస్సీ జనరల్, 39, 40వ డివిజన్లు బీసీ మహిలకు, 41వ డివిజన్ ఎస్సీ జనరల్‌కు, 42వ డివిజన్ జనరల్ మహిళకు, 43, 44వ డివిజన్లు ఎస్సీ జనరల్‌కు, 45వ డివిజన్ జనరల్‌కు, 46వ డివిజన్ ఎస్సీ జనరల్, 47వ డివిజన్ బీసీ జనరల్, 48వ డివిజన్ ఎస్సీ మహిళ, 49, 50వ డివిజన్లు జనరల్‌కు, 51వ డివిజన్ బీసీ మహిలకు, 52వ డివిజన్ జనరల్, 53వ డివిజన్ బీసీ జనరల్, 54వ డివిజన్ బీసీ జనరల్, 55వ డివిజన్ జనరల్ మహిళకు, 56వ డివిజన్ బీసీ మహిలకు, 57వ డివిజన్ జనరల్‌కు, 58, 59వ డివిజన్లు బీసీ జనరల్‌కు, 60వ డివిజన్ బీసీ మహిళకు ఖరారు చేశారు.
పెద్దపల్లి మున్సిపాల్టీ పరిధిలో రిజర్వేషన్లు ఇవే..
పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ పదవిని బీసీ జనరల్‌కు రిజర్వు చేయగా.. మున్సిపల్ పరిధిలోని 36వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 1వ వార్డు జనరల్ మహిళ, 2వ వార్డు ఎస్సీ మహిళ, 3వ వార్డు ఎస్సీ జనరల్, 4వ వార్డు బీసీ జనరల్, 5వ వార్డు జనరల్, 6వ వార్డు బీసీ మహిళ, 7వ వార్డు ఎస్సీ జనరల్, 8వ వార్డు జనరల్ మహిళ, 9వ వార్డు బీసీ జనరల్, 10వ వార్డు ఎస్సీ మహిళ, 11వ వార్డు బీసీ మహిళ, 12వ వార్డు జనరల్, 13వ వార్డు జనరల్, 14వ వార్డు జనరల్, 15వ వార్డు బీసీ జనరల్, 16వ వార్డు జనరల్, 17వ వార్డు జనరల్, 18వ వార్డు జనరల్, 19వ వార్డు ఎస్టీ జనరల్, 20వ వార్డు బీసీ మహిళ, 21వ వార్డు బీసీ జనరల్, 22వ వార్డు జనరల్ మహిళ, 23వ వార్డు బీసీ జనరల్, 24వ వార్డు బీసీ మహిళ, 25వ వార్డు జనరల్ మహిళ, 26వ వార్డు జనరల్, 27వ వార్డు జనరల్ మహిళ, 28వ వార్డు బీసీ మహిళ, 29వ వార్డు జనరల్ మహిళ, 30వ వార్డు బీసీ మహిళ, 31వ వార్డు బీసీ జనరల్, 32వ వార్డు జనరల్ మహిళ, 33వ వార్డు జనరల్ మహిళ, 34వ వార్డు బీసీ జనరల్, 35వ వార్డు జనరల్ మహిళ, 36వ వార్డు జనరల్ మహిళకు రిజర్వయ్యాయి.
మంథని మున్సిపాల్టీ పరిధిలో రిజర్వేషన్లు ఇవే..
మంథని మున్సిపల్ చైర్మన్ పదవిని బీసీ జనరల్‌కు రిజర్వు చేయగా.. మున్సిపల్ పరిధిలోని 13వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేశారు. 1వ వార్డు ఎస్టీ జనరల్, 2వ వార్డు ఎస్సీ జనరల్, 3వ వార్డు జనరల్, 4వ వార్డు ఎస్సీ మహిళ, 5వ వార్డు జనరల్, 6వ వార్డు జనరల్ మహిళ, 7, 8, 9వ వార్డులు జనరల్ మహిళకు, 10వ వార్డు బీసీ జనరల్, 11వ వార్డు బీసీ జనరల్, 12వ వార్డు బిసి మహిళ, 13వ వార్డు జనరల్‌కు కేటాయించారు.

సుల్తాన్‌బాద్ మున్సిపాల్టీ పరిధిలో రిజర్వేషన్లు ఇవే..
సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ పదవిని జనరల్‌కు రిజర్వు చేయగా.. మున్సిపల్ పరిధిలోని 15వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. 1వ వార్డు బీసీ మహిళ, 2వ వార్డు జనరల్, 3వ జనరల్ మహిళ, 4వ వార్డు జనరల్, 5వ వార్డు బీసీ మహిళ, 6వ వార్డు జనరల్, 7వార్డు ఎస్సీ జనరల్, 8ఎస్టీ జనరల్, 9వ వార్డు జనరల్, 10వ వార్డు బీసీ జనరల్, 11వ వార్డు ఎస్సీ మహిళ, 12వ వార్డు జనరల్ మహిళ, 13వ వార్డు బీసీ జనరల్, 14, 15వ వార్డులు జనరల్ మహిళకు కేటాయించారు.