Odela Court | ఓదెల, నవంబర్ 17 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో న్యాయస్థానం ముందున్న వైన్స్ షాపును అక్కడి నుంచి తరలించాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణిలో దరఖాస్తు పెట్టారు. ఓదెలలోని వైన్స్ షాపు కోర్టుతో పాటు మండల కార్యాలయాలు, పలు స్కూళ్లకు సమీపంలో ఉండడం వల్ల ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు మంద కొమురయ్య వినతి పత్రంలో పేర్కొన్నారు.
అలాగే సుల్తానాబాద్ ఎక్సైజ్ సీఐకి కూడా వినతి పత్రాన్ని అందజేశారు. డిసెంబర్ 1 వ తేదీ నుంచి నూతనంగా వైన్ షాప్ ఏర్పాటు కానుండడంతో కోర్టు ముందున్న స్థలం నుంచి వేరే చోటకు మార్చే విధంగా చూడాలని కోరారు.