కమాన్‌చౌరస్తా, ఏప్రిల్ 22: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో కరీంనగర్ శ్రీ చైతన్య విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయభేరి మోగించారని విద్యాసంస్థల అధినేత ముద్దసాని రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కళాశాల ప్రాంగణంలో ఆయన విద్యార్థులను అభినందించి మాట్లాడారు. నాణ్యమైన కార్పొరేట్ స్థాయి విద్యను ఉత్తర తెలంగాణ ప్రాంత విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో శ్రీ చైతన్య విద్యాసంస్థలు నడుస్తున్నాయని తెలిపారు.
శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ జూనియర్ కళాశాలలు స్థాపించిన నాటి నుంచి రాష్ట్ర స్థాయి ర్యాంకులకు కేరాఫ్‌గా నిలువడం సంతోషంగా ఉందన్నారు. ఈ క్రమంలోనే కళాశాలకు చెందిన ద్వితీయ సంవత్సర విద్యార్థులు ఎంపీసీలో ఆర్ వైష్ణవి 993, ఏ లాస్వికా 992, జీ శ్రీనిత్య 991, పీ భరత్‌రెడ్డి 991, ఇ అకిరానందన్ 991, బైపీసీలో ఏ అభ్యుదయ 994, ఎన్ భార్గవి 992, పీ స్ఫూర్తిశ్రీ 990, బీ రోహిత్ 990.
సీఈసీలో ఏ మధుమిత 961, ఎంఈసీలో మెరుగు భానుప్రకాశ్ 951 సాధించడం హర్షించదగ్గ విషయమన్నారు. అలాగే, ఫస్టియర్ ఎంపీసీలో ఏ లక్ష్మీహసిని 468, జీ శ్రీహిత 467, పీ హాసినిరావు 467, ఎం సాత్విక 467, జీ శ్రీనిధి 467, కే మైత్రి 467 మార్కులు సాధించారని చెప్పారు. కళాశాలకు చెందిన 22మంది విద్యార్థులు 466, 14మంది విద్యార్థులు 465 మార్కులు సాధించినట్లు తెలిపారు.
బైపీసీలోలో ఈ అఖిల 437, ఔష సినివాసన్ 437, ఎస్ విఘ్న 436, వీ లహరి 436, ఆర్ అక్షయశ్రీ 436, సీహెచ్ కార్తీక్ 436 సాధించారని, 13మంది విద్యార్థులు 430పైగా మారులు సాధించారని తెలిపారు. ఎంఈసీలో ఎల్ కమలేశ్ కుమార్ 474, సూర మనీష 470, సీఈసీ విభాగంలో టీ హరిణి 492. కే అంజలి 491మారులు సాధించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ కళాశాలల డైరెక్టర్ కర్ర నరేందర్‌రెడ్డి, డీన్ జగన్మోహన్రెడ్డి, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ మల్లారెడ్డి, రాధాకృష్ణ, మోహన్‌రావు, ఏజీఎం శ్రీనివాస్, అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.