TBGKS President Miriyala Rajireddy | గోదావరిఖని : సింగరేణి సంస్థలో ఈ నెల 24, 25 తేదీల్లో జరిగిన మెడికల్ బోర్డు కేవలం అడ్వైజరీ మెడికల్ బోర్డు మాత్రమేనని, సాధారణంగా జరిగే మెడికల్ బోర్డు కాదని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి విమర్శించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 16 నెలల నుండి 24 నెలల సర్వీస్ కలిగిన సుమారు వెయ్యి 24 నెలల సర్వీస్ కలిగిన సుమారు వెయ్యి కి పైగా కార్మికులు మెడికల్ బోర్డు కోసం ఎదురుచూస్తున్నారని వారు ఎవరిని ఈనెల 24 25 తేదీల్లో జరిగిన మెడికల్ బోర్డుకు పిలువలేదని ఆయన పేర్కొన్నారు.
కేవలం అడ్వైజరీ మెడికల్ బోర్డుకు 125 మందిని పిలిచి కేవలం 25 మందిని మాత్రమే మెడికల్ అన్ ఫిట్ చేసి మిగతా వారిని విస్మరించారని ఆయన ఆరోపించారు. గుర్తింపు ప్రాతినిధ్య సంఘమైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలు ఎవరికి వారుగా తమ కృషి వల్లనే మెడికల్ బోర్డు పెట్టారని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రతీ నెల నిర్వహించాల్సిన మెడికల్ బోర్డును నిర్వహించకపోవడం వల్ల ఇప్పటికే వెయ్యి మంది కార్మికులకు పైగా మెడికల్ బోర్డు కోసం వేచి చూస్తున్నారని, వారికి ఎలాంటి న్యాయం చేయకుండా మెడికల్ బోర్డు నిర్వహించకుండా ఏదో సింగరేణి సంస్థ నిర్వహించే అడ్వైజర్ మెడికల్ బోర్డును నిర్వహించి కార్మిక సంఘాలు తామేమో సాధించామని చెప్పుకోవడం సరికాదని ఆయన విమర్శించారు.
గతంలో ఎప్పుడూ లేనివిధంగా కార్మికులు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలపై గుర్రు గా ఉన్నారని ఆయన అన్నారు. తాము గుర్తింపు సంఘం గా ఉన్న సమయంలో మెడికల్ బోర్డులో 80 శాతానికి పైగా మెడికల్ అన్పిట్ లు జరిగాయని ఇప్పుడు మాత్రం 25 శాతానికి మించడం లేదని ఈ విషయమై కార్మికులకు వారు ఏం సమాధానం చెప్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మెడికల్ బోర్డుపై పోరాటం చేసి ప్రతీ నెల మెడికల్ బోర్డు నిర్వహించేలా ఇప్పటికైనా మెడికల్ బోర్డుపై పోరాటం చేసి ప్రతీ నెల మెడికల్ బోర్డు నిర్వహించేలా ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి, నాయకులు వడ్డేపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.