గంగాధర, జూన్ 17: స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రేవంత్ సర్కారు రైతు భరోసా డ్రామాకు తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే మోసపోయి గోస పడుతామని, రైతు బంధుకు రాం రాం చెబుతారని అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాటలను రేవంత్ ప్రభుత్వం అక్షరాలా నిజం చేసిందని గుర్తు చేశారు.
సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసమే రైతు భరోసా అంటూ కొత్త నాటకామాడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ వానకాలంతోపాటు యాసంగిలో ఎగొట్టిన రైతు భరోసా కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు.