ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం అందుకు తగినట్లుగా ఏర్పాటు చేయకపోవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులు రేషన్ దుకాణాల వద్ద అవస్థలు పడుతున్నారు. సన్నం బియ్యం అందుతాయో లేవోనన్న ఆందోళనతో షాపుల వద్ద బారులు తీరి నిల్చుంటున్నారు. గంటల తరబడి లైన్లలో నిలబడలేక సంచులు, కార్డులు పెడుతూ వేచి చూస్తున్నారు. మరోవైపు సర్వర్లో తలెత్తిన లోపంతో రోజంతా పడిగాపులు కాస్తూ ఓపిక నశించి తిరిగి నిరాశతో ఇళ్లకు వెళ్తున్నారు.
సర్వర్ వచ్చినా ఇంతకుముందు 24 కిలోలకు ఒకేసారి తంబ్వేయగా ప్రస్తుతం 20 కిలోలకు ఒకసారి నాలుగు కిలోలకు మరోసారి.. ఇలా మూడు నెలలకు సుమారు ఆరు సార్లు తంబ్ వేయాల్సి వస్తుంది. ఈ కారణంగా ఒక గంట సమయంలో కేవలం ఇద్దరి నుంచి ముగ్గురికి మాత్రమే ఈ బియ్యం పంపిణీ జరుగుతుంది. దీంతో ప్రజలు గంటల తరబడి లైన్లో వేచిచూడాల్సి వస్తున్నది. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, కరీంనగర్