మానకొండూర్, మే 18: పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌పై నిష్పక్షపాతంగా విచారణ జరగాలంటే బండి సంజయ్‌ను తక్షణమే కేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. సోమవారం మానకొండూర్ మండల కేంద్రంలోని పల్లెమీద చౌరస్తా వద్ద కరీంనగర్ – వరంగల్ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. రసమయి మాట్లాడుతూ, సంజయ్ కేంద్రమంత్రిగా ఉంటే బాధిత బాలికకు న్యాయం జరుగదని విమర్శించారు.
ఒక బాధ్యత గల హోదాలో ఉన్న ఆయన, నిందితుడైన భగీరథ్‌కు చట్టవిరుద్ధంగా రక్షణ కల్పించాడంటే సమాజం సిగ్గుపడుతున్నదని మండిపడ్డారు. నిందితుడికి రక్షణ కల్పించిన సంజయ్‌ను ఏ2, కేసును నీరుగార్చేందుకు సంజయ్‌కు కొమ్ముకాస్తున్న రేవంత్‌రెడ్డిని సైతం ఏ3గా చేర్చాలని డిమాండ్ చేశారు. బాలికకు అన్యాయం జరిగితే తెలంగాణ సమాజం ఊరుకోదని హెచ్చరించారు. ఇక్కడ రాష్ట్ర నాయకులు గడ్డం నాగరాజు, కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి. మాజీ జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పొద్దుటూరి సంజీవరెడ్డి, నాయకులు గంప వెంకన్న, గంట మహిపాల్, ఉల్లెంగుల ఏకానందం, లత, శాతరాజు యాదగిరి, పిట్టల మధు, గుర్రం కిరణ్‌గౌడ్ పాల్గొన్నారు.