MAMIDIPALLY | కోనరావుపేట, ఏప్రిల్ 6: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయం అయిన మామిడిపల్లి శ్రీసీతారామస్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. దీంతో రాములగుట్ట రామనామస్మరణతో మారోగింది. అలయ అధికారులు స్వామివారి కల్యాణ మండపాన్ని పచ్చని తోరణాలు, రంగురంగుల పూలతో ముస్తాబు చేశారు.
కల్యాణానికి హాజరైన భక్తులు
అనంతరం స్వామివారి వైపు అర్చకులు, అమ్మవారి వైపు అధికారులు ఉండి ఎదుర్కొలు ఘట్టాన్ని అపూర్వంగా నిర్వహించారు. అధికారులు పట్టు వస్త్రాలు తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. యాజ్ఞచార్యులు మరింగంటి రామగోపాల చార్యులు, అర్చకులు తిరునహరి కృష్ణ, లక్ష్మణ్ శ్రీ సీతారామస్వామి ఉత్సవవిగ్రహాలను నూతన పట్టు వస్త్రాలతో అలంకరించారు. పల్లకిలో స్వామివారి విగ్రహాలను ఉంచి మంగళవాయిద్యాలు, భక్తుల భజన సంకీర్తనలతో ముస్తాబు చేసిన వేదికపైకి తీసుకువెళ్లారు.
అనంతరం వేదామంత్రోచ్చరణాల మధ్య సుముర్తమున స్వామివారు అమ్మవారి మెడలో మంగళ్యధారణ చేశారు. ఈ కల్యాణ క్రతువును వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన 30వేల మంది భక్తులు వీక్షించారు. అనంతరం వెంట తెచ్చుకున్న ఒడి బియ్యం, కట్నాకానుకలను స్వామివారికి సమర్పించారు. కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకున్నారు. దేవాలయ అధికారులు స్వామివారి కల్యాణానికి వచ్చిన భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటుగా అన్నదానం నిర్వహించారు. గ్రామస్తులు, శ్రీరామంజనేయ సేవాసమితి సభ్యులు అన్నదాన సేవలో పాల్గొన్నారు.
హాజరైన ప్రముఖులు..
స్వామివారి కల్యాణ తంతుకు పెద్ద ఎత్తున భక్తులతో పాటు పలువురు ప్రముఖులు కల్యాణాన్ని తిలకించారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, చందుర్తి సీఐ వేంకటేశ్వర్లు, ఎస్ఐ ప్రశాంత్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బండ నర్సయ్య కల్యాణానికి హాజరై కల్యాణాన్ని వీక్షించారు.
ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ వేంకటప్రసాద్, డీఈ మహిపాల్‌రెడ్డి, ఏఈ నాగరాజు, ఇన్చార్జీ నరేందర్, జూనియర్ అసిస్టెంట్లు దేవయ్య, లక్ష్మణ్, మాజీ ఉపసర్పంచ్ రాంరెడ్డి, శ్రీరామంజనేయ భక్తులు తదితరులు పాల్గొన్నారు.