ELLANDAKUNTA | ఇల్లందకుంట ఏప్రిల్ 6. అపర భద్రాదిగా పేరుగాంచిన ఇల్లందకుంట రాములవారి ఆలయంలో ఆదివారం సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కల్యాణతంతుకు కలెక్టర్ ప్రమేల సత్పతి, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కరీంనగర్ పోలీసుకమీషనర్ గౌస్ అలం హాజరై స్వామివారికి పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
భక్తులు అధిక సంఖ్యలో హాజరు కాగా దేవస్థానం కమిటీ, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీపీ ఆధ్వర్యంలో ఏసీపీ శ్రీనివాస్జీ, సీఐలు, ఎస్సైలు పోలీసు బందోబస్తు నిర్వహించారు. అలాగే భక్తులకు కాటన్ రైస్ మిల్లర్ల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చి కళ్యాణం తిలకించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్, ఆర్డీవో రమేష్ బాబు, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, ఈవో సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.