Sarpanch unanimously | పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 7 : పెద్దపల్లి మండలంలో ఏకగ్రీవ సర్పంచ్ గా మండలంలోని రాంపల్లి బోణీ కొట్టినట్లయింది. రాంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన కనపర్తి సంపత్ రావు, కోదాటి దేవేందర్ రావులలో గ్రామస్తులు, వెలమ సంఘం నాయకులు, మాజీ ప్రజాప్రతినిధుల బుజ్జగింపులతో తన నామినేషన్ను కోదాటి దేవేందర్ రావు ఉపసంహరించుకున్నారు.
దీంతో ఇక సర్పంచ్ బరిలో కనపర్తి సంపత్ రావు ఒకరి నామినేషన్ మాత్రమే ఉండడంతో ఏకగ్రీవమైనట్లయింది. సంపత్ రావు ఏకగ్రీవ ఎన్నికను నామినేషన్ ల ఉపసంహరణల అనంతరం ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు.