Chigurumamidi | చిగురుమామిడి, జూన్ 1 : చిగురుమామిడి మండల ప్రజా పరిషత్ అధికారిగా (ఎంపీడీవో) రామ్మోహన్ చారి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ లో ఎంపీడీవోగా విధులు నిర్వహించి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇక్కడ విధులు నిర్వహించిన తూమట్ల విజయ్ కుమార్ వీణవంక మండలానికి ఎంపీడీవో గా బదిలీపై వెళ్లనున్నారు.
అనతి కాలంలోనే విజయ్ కుమార్ మండలంలో మంచి గుర్తింపు పొంది మండల ప్రజల ఆదరాభిమానాలు చూరగో న్నారు. అంకితభావంతో విధులు నిర్వహించారు. బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవో రామ్మోహన్ చారి మాట్లాడుతూ మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు.