Jagityal | మల్లాపూర్, ఆగష్టు 2: మండల కేంద్రంలోని స్థానిక ఐకేపీ సెర్ఫ్ కార్యాలయంలో మల్లాపూర్ మండల నూతన ఏపీఎంగా రమేష్ శనివారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని అధికారులు, ప్రజాప్రతినిధులు, సెర్ఫ్ సిబ్బంది, మహిళ సంఘాల సభ్యులు, ప్రజల సమిష్టి సహకారంతో మండలాభివృద్దికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
అనంతరం స్థానిక సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు ఇక్కడ ఏపీఎంగా పనిచేసిన దేవరాజ్ మల్యాల మండలానికి బదిలీ అయ్యారు.