Chigurumamidi |చిగురుమామిడి, ఏప్రిల్ 13: మండలంలోని రేకొండ గ్రామ గౌరీ శంకర ఆలయ కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. ఆలయ చైర్మన్ గా తమ్మిశెట్టి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ప్రధాన కార్యదర్శిగా కనవేణి శ్రీనివాస్, కోశాధికారి మోర పద్మనాభం, కార్యవర్గ సభ్యులుగా శ్రీమంతుల వెంకటస్వామి, ఏరుకొండ రమేష్, దుడ్డేల రాజు, దాసరి సాగర్ రెడ్డి, చందవేని స్వామి, గాజపాక సునీల్, అల్లెపు తిరుపతి, తాటికొండ అభిషేక్ రెడ్డి లను ఎన్నుకున్నారు.
ఈ ఆలయ కమిటీకి గౌరవ అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఉన్నారు. వీరి నియామకం పట్ల లక్ష్మీనరసింహస్వామి ఆలయ అధ్యక్ష, కార్యదర్శులు దుడ్డేల లక్ష్మీనారాయణ, కాసాని సతీష్, కోశాధికారి అరిగెల రమేష్ అభినందనలు తెలిపారు.