యైటింక్లయిన్‌కాలనీ, జనవరి 1: కేంద్ర ప్ర భుత్వం సింగరేణి జోలికి వస్తే సహించబోమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అ న్నారు. ‘బాయి బాట’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఓసీపీ-3 కృషి భవన్లో కార్మికులను కలుసుకున్నారు. నూతన సంవత్సర కేక్‌ను కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సం వత్సరంలో కార్మిక వర్గం ఎలాంటి కష్టాలు లే కుండా సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాల ని ఆకాంక్షించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ సింగరేణిపై కేంద్రం కుట్రలు పన్నుతున్న దని విమర్శించారు. ఇందులో భాగంగానే సం స్థకు చెందిన కేకే 5, శ్రావణ్‌పల్లి, సత్తుపల్లి, పెనగ డప్ప బ్లాకుల వేలం వేసేందుకు కుట్ర పన్నుతు న్నదని పేర్కొన్నారు.
ఈ బ్లాకుల వేలం ఆపేదాకా పోరాటం ఆగదని హెచ్చరించారు. స్వరాష్ట్రంలో కేసీఆర్ మార్గదర్శకంలో ఎనిమిదేండ్లుగా సింగరే ణి సంస్థ లాభాల వైపు పయనిస్తున్నదని గుర్తు చేశారు. టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కెంగర్ల మల్లయ్య, డివిజన్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ అభిషేక్‌రావు, కార్పొరేటర్లు బదావత్ శంకర్ నాయక్, సాగంటి శంకర్, పీటీ స్వామి, కొత్త సత్య నారాయణ రెడ్డి, కొంగర రవీందర్, దేవ వెంక టేశం, కర్క శ్రీని వాస్ రెడ్డి, నాచగోని దశరథమ్ గౌడ్, ఐ సత్యం, బానాకర్. ఆవునూరి రాజేశం, బేతి చంద్రయ్య, జాడి వెంకటీ, చల్లా రవీందర్ రెడ్డి, జగన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.