Lions Club | కోల్ సిటీ, డిసెంబర్ 28: సమాజ సేవలో లయన్స్ క్లబ్ కు ప్రపంచ గుర్తింపు సమష్టి కృషి ఫలితమేననీ, తెలంగాణ రాష్ట్రంలోనే రామగుండం క్లబ్ పనితీరు భేషుగ్గా ఉందని లయన్స్ క్లబ్ గవర్నర్ సింహరాజు కోదండ రాం ప్రశంసించారు. ఈమేరకు గవర్నర్ ఆదివారం గోదావరిఖనిలో అధికారిక పర్యటన చేశారు. క్లబ్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పలు సామాజిక సేవా కార్యక్రమాలు విరివిగా చేపట్టారు. ముందుగా లక్ష్మీనగర్ లో లేబర్ అడ్డా కార్మికులకు ఉచిత అల్పహారం చేశారు. సాయి సేవా సమితికి బియ్యం,,స్లీట్ ప్లేట్లు వితరణ చేశారు. పలు ప్రాంతాల్లో సిమెంట్ బెంచీలు ఏర్పాటుచేశారు.
మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. లక్ష్మీపూర్ ఆరోగ్య కేంద్రంకు సీపీయూ అందజేశారు. గాంధీనగర్ గోశాలకు గ్రాస్ పంపిణీ చేశారు. క్లబ్ ఆవరణలో ఐదుగురు మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందజేశారు. అలాగే రూ.1.50లక్షలతో కృత్రిమ అవయవాలు అందజేశారు. గవర్నర్ మాట్లాడుతూ ఇక్కడి క్లబ్ సభ్యులు సేవకు ప్రతిరూపంగా నిలవడం గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ గవర్నర్ ప్రమోద్ కుమార్, పీ ఎస్ టీ లు ఎల్లప్ప, సారయ్య, రాజేంద్రకుమార్, సీనియర్ సభ్యులు మినేష్ నారాయణ్ టండన్, సత్యనారాయణ, గంగాధర్, రామస్వామి, రాజేందర్, చక్రవర్తి, పీ.మల్లికార్జున్, ఆంజనేయులు, బేణి గోపాల్, మనోజ్ కుమార్ , కోలేటి శ్రీనివాస్, తానిపర్తి విజయలక్ష్మీ, మనీషా అగర్వాల్, కళావతి, రంగమ్మ తదితరులు పాల్గొన్నారు.