Ramagundam Lions Club | అక్షయపాత్రగా రామగుండం లయన్స్ క్లబ్.. రామగుండం మేయర్ మహంకాళి స్వామి
ఆకలితో ఏ ఒక్కరూ అలమటించకూడదని మానవసేవే మాధవ సేవగా భావించి ఎంతో మంది పేదల ఆకలి తీరుస్తూ రామగుండం లయన్స్ క్లబ్ అక్షయపాత్రగా నిలిచిందని రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి అన్నారు.
Ramagundam Lions Club | కోల్ సిటీ, జూన్ 27 : ఆకలితో ఏ ఒక్కరూ అలమటించకూడదని మానవసేవే మాధవ సేవగా భావించి ఎంతో మంది పేదల ఆకలి తీరుస్తూ రామగుండం లయన్స్ క్లబ్ అక్షయపాత్రగా నిలిచిందని రామగుండం నగర పాలక సంస్థ మేయర్ మహంకాళి స్వామి అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో ఉచిత మీల్స్ ఆన్ వీల్స్ ద్వారా నిత్యన్నదానానికి శ్రీకారం చుట్టి దిగ్విజయంగా వెయ్యి రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శనివారం గోదావరిఖని కూరగాయల మార్కెట్ వద్ద మీల్స్ ఆన్ వీల్స్ ద్వారా వెయ్యి రోజుల వేడుకగా ఉచిత అల్పాహార వితరణ చేపట్టారు. మేయర్ ముఖ్యఅతిథిగా హాజరై క్లబ్ సభ్యుల సేవలను కొనియాడారు.
రామగుండం లయన్స్ క్లబ్ కేవలం ఒక స్వచ్ఛంద సంస్థ మాత్రమే కాదని, ఎంతోమంది పేదలకు అన్నం పెడుతున్న అక్షయపాత్ర అని పేర్కొన్నారు. క్లబ్ సభ్యులంతా ఒక కుటుంబం కంటే ఎక్కువగా కలిసిమెలిసి ఉండడమే కాకుండా సమాజహిత కార్యక్రమాల్లో ఇతర స్వచ్ఛంద సంస్థల కంటే ముందు వరుసలో ఉండడం అభినందనీయమని తెలిపారు. గత వెయ్యి రోజులుగా నిర్విఘ్నంగా నిత్య అన్నదానం చేయడం అంటే సాధారణ విషయం కాదన్నారు.
అన్నదానమే కాకుండా వేలాది మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించడం, పేద పిల్లలకు జీవనోపాధి కోసం ఉచితంగా కుట్టు మిషన్లు, విద్యార్థులకు, నిరుపేదలకు చేయూత అందించడం లయన్స్ క్లబ్ గొప్పతనమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మీల్స్ అండ్ వీల్స్ కోఆర్డినేటర్ రామస్వామి, జోన్ చైర్ పర్సన్ దాని పరిస్థితి గోపాల్ రావు, కజంపురం రాజేందర్, తిలక్ చక్రవర్తితో పాటు లయన్స్ క్లబ్ సభ్యులు, పలువురు కార్పొరేటర్లు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

