Ramagiri Press Club | రామగిరి జూన్ 12: పెద్దపల్లి జిల్లా జర్నలిస్ట్ యూనియన్ టీయూడబ్ల్యూజే (ఐజేయూ) అధ్యక్షుడి బరిలో గోదావరిఖని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మల్లోజుల వంశీ బరిలో నిలిచారు. ఈ మేరకు గురువారం సెంటినరీ కాలనీ లో రామగిరి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గోదావరిఖని ప్రెస్ క్లబ్ సెక్రటరీ పందిల్ల శ్యామ్, జిల్లా ఉపాధ్యక్షులు పాలకుర్తి విజయ్, జిల్లా ఆర్గనైజ్ సెక్రటరీ కె.ఎస్.వాసు తో పాటు వంశీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ తనను గెలిపిస్తే జర్నలిస్ట్ ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మెజారిటీ సభ్యులందరూ వంశీ కి మద్దతు ప్రకటించారు. ఆదివారం జరిగే ఎన్నికల్లో వంశీనే గెలిపించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రెస్ క్లబ్ భాద్యులు పీవీ రావు, పొన్నం శ్రీనివాస్, జ్యోతుల ప్రవీణ్, కాపర్తి వెంకటేష్, పెరబోయిన రవీందర్, చిందం రమేష్, మల్యాల రమేష్, సూత్రం శ్రీధర్, చింతం కిరణ్, చిలుక సురేష్, పోలు మధూకర్, ఊట్ల తిరుపతి రెడ్డి, బర్ల వెంకటేష్, కాపర్తి అభిలాష్, గాజుల రఘుపతి, ఏకు రవీంద్ర, సిద్ధం ప్రదీప్, దాసరి భరత్, జి.కె.రాజు, నాంసాని సందీప్, బొల్లపెల్లి సాయి కుమార్, దొంతుల మణికంఠ, పానుగంటి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.