కొనరావుపేట : రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన పొట్ల బాలమళ్లు, మంజుల దంపతుల కుమారుడు రాకేష్ (18)హైదరాబాద్లోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం ఇంటికి వస్తూ సిరిసిల్ల బస్టాండ్లోని ఆటోలో బ్యాగ్ పెట్టాడు. అతర్వాత కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఈ క్రమంలో రాకేష్ హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో సూసైడ్ నోట్ రాసి రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అమ్మ, నాన్న నన్ను క్షమించండి. మీరంటే నాకిష్టం. నాకు బతకాలని లేదు. నా చావుకు కారణం ఎవరు కాదు అని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు సుసైడ్ నోట్లో రాసిన ఫోన్ నెంబర్ ఆధారంగా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. రాకేష్ మరణ వార్తతో గ్రామంలో విషాదం నెలకొంది.