Women | వేములవాడ, జూన్ 10: తాను కష్టపడి పనిచేసిన డబ్బులు తనకు ఇప్పించాలంటూ పోలీసు ఠాణా మెట్ల ఎక్కింది ఓ మహిళ. తాను పనిచేసిన వ్యక్తి నుండి 2000 రూపాయలు ఇప్పించాలని పోలీసులను కోరగా సదరు గుత్తేదారుతో పంచాయతీ చేసి 1000 రూపాయలు ఇప్పించారు. ఇక్కడే అసలు కథ ప్రారంభమైంది. తాను కష్టపడి పనిచేస్తే మీరు ఎలా డబ్బులు తగ్గిస్తారని ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళ ఏకంగా పోలీస్ వాహనంతో పాటు అధికారిపై బండరాయితో దాడికి దిగిన సంఘటన వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది.
వేములవాడ పురపాలక సంఘం పరిధిలోని తిప్పాపూర్ కు చెందిన ఓ మహిళ బుధవారం వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. అయితే తనకు రావలసిన 2వేల రూపాయలను ఇప్పించాలని పోలీసులను కోరగా పంచాయతీ చేసి 1000 రూపాయలు ఇప్పించారు. దీంతో తాను కష్టపడి పని చేస్తే రెండు వేలకు ఎలా 1000 రూపాయలు తగ్గిస్తారంటూ పోలీసులపైనే ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది ఆమెను మందలించారు. ఆగ్రహంతో ఆమె ఊగిపోయి రాయితో పోలీస్ వాహనంపై దాడి చేసేందుకు ప్రయత్నం చేయగా ఆమెను పోలీసులు అడ్డుకొని ఎస్ హెచ్ ఓ కార్యాలయంలోకి తీసుకెళ్లారు.
అయినప్పటికీ ఆమె చేతిలోని రాయితో ఎస్ హెచ్ ఓ పైకి దాడి చేసేందుకు కూడా ప్రయత్నించింది. దీంతో అక్కడే ఉన్న పోలీసులు ఆమెను ప్రతిఘటించి చితక బాదారు. ఆమెను పక్కనే ఉన్న గదిలోకి వెళ్లి కూర్చోబెట్టగా మళ్లీ అక్కడి నుండి బయటకు వచ్చి పోలీసులు నన్ను అకారణంగా కొట్టారంటూ కేకలు వేస్తూ పోలీస్ ఇన్నోవా వాహనంపై దాడి చేయగా.. ఇన్నోవా వాహనం ముందు భాగంలోని అద్దం స్వల్పంగా ధ్వంసం అయింది. 2000 రూపాయల కోసం సదరు మహిళ పోలీస్ స్టేషన్లో నానా హంగామా చేసింది. మహిళ వ్యవహారం పోలీసులకు దడ పుట్టించింది.
అన్ని రంగాల్లో నల్లగొండను అభివృద్ధి పరిచేందుకు కృషి : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Gorilla’s Reaction | గర్ల్ ఫ్రెండ్‌తో గొడవ.. అచ్చం మనిషిలాగే బాధపడుతున్న మగ గొరిల్లా.. Video viral