ఎల్లారెడ్డిపేట, జూలై 29 : క్యాన్సర్ వ్యాధి సోకి ఆరోగ్యం క్షీణిస్తుందని, ఆర్థికంగా తన వల్ల ఇబ్బందుల వుతున్నాయని కుంగిపోయిన ఓ మహిళ మితిమీరిన కాల్షియం టాబ్లెట్లను మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి బంధువులు అందించిన వివరాల ప్రకారం.. దుమాలకు చెందిన పిల్లి మానస(38)కు గత ఏడేండ్ల క్రితం బోన్ క్యాన్సర్ రాగా చికిత్స కోసం పలు హాస్పిటల్స్చుట్టూ తిరుగుతున్నది. తనకు ఇద్దరు కవల పిల్లలు శ్రీరాం, శ్రీధర్(13) ఉన్నారు. అందులో చిన్న కుమారుడు శ్రీధర్‌కు మూడు నెలల క్రితం నిమోనియా రావడంతో చికిత్స కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటికే కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది. తన కుమారుడి అనారోగ్య పరిస్థితిని చూసి తట్టుకోలేక పోయింది.
దీంతో ఈ నెల 26న తన పిల్లల ముందే పిల్లల కోసం తెచ్చిన పెరస్ పోలిక్ ఆసిడ్ టాబ్లెట్ల్ మూడు షీట్లు(30) గోలీలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ ఘటన చూసిన కుమారుడు శ్రీధర్ ఇంటి బయట ఉన్న తన తండ్రి రామచంద్రంకు సమాచారం అందివ్వగా చికిత్స నిమిత్తం సిరిసిల్లలోని ప్రభుత్వ దవాఖానాకు తీసుకెల్లారు. పరిస్థితి విషమంగా మారడంతో సోమవారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు మృతురాలి తండ్రి పెరుమాల్ల పోశెట్టి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.