KTR | సిరిసిల్ల ప్రజలకు అంతా తెలుసు.. ఆ 8 వేల ఎకరాల సర్వే నంబర్లు ఎంత..? : కేటీఆర్
KTR | సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్లకొచ్చి మీకు 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టానని చెప్తారా..? 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన వెధవను నేనే అని చెప్తాడా..? లేకపోతే సిరిసిల్ల నేతన్నలు మళ్లీ ఆత్మహత్యల బాట పట్టడానికి కారణం నేనే అని చెప్తాడా..? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
KTR | త్వరలో సిరిసిల్ల, సిద్దిపేటలో సభలు పెట్టి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో చురకలించారు. సిరిసిల్లలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సిరిసిల్లకొచ్చి మీకు 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టానని చెప్తారా..? 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన వెధవను నేనే అని చెప్తాడా..? లేకపోతే సిరిసిల్ల నేతన్నలు మళ్లీ ఆత్మహత్యల బాట పట్టడానికి కారణం నేనే అని చెప్తాడా..? సిరిసిల్లను జిల్లా చేసింది కేసీఆర్. ఒక డిగ్రీ కాలేజ్ లేని సిరిసిల్లలో ఒక మెడికల్ కాలేజ్, ఒక వ్యవసాయం కాలేజ్, ఒక వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజ్, ఒక జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజ్.. ఇలా ఒక ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చింది కేసీఆర్. మరి అవన్నీ చూసి రేపు కొడంగల్‌లో ఇంప్లిమెంట్ చేయడానికి వస్తుండేమో నాకు తెల్వదన్నారు.
సిరిసిల్లకొచ్చి ఏం చెస్తారో కూడా చెప్పాల్సి ఉంటుంది.. మూడేళ్ల తర్వాత కూడా పాడిందే పాట అని మాట్లాడితే కాదు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ హితవు పలికారు. మీరు ఈ మూడేళ్లలో సిరిసిల్లకు చేసిందేమిటీ..సిరిసిల్ల ధార్మిక, కార్మిక, కర్షక క్షేత్రం.. అక్కడి నేతన్నలు, రైతన్నలు, కార్మిక వర్గానికి మీరు ఇప్పటికే వెన్నుపోటు పొడిచారు. వారి ఆత్మహత్యలకు కారణమయ్యారు. అక్కడి కర్షక లోకం ఇవాళ కసి మీద ఉంది.. అక్కడ కాళేశ్వరం ఎండబెట్టి.. మూడు సార్లు రైతు బంధు ఎగ్గొట్టి కర్షకుల పొట్ట కొట్టారు. బతుకమ్మ చీరలు బంద్ చేసి కార్మికుల పొట్ట కొట్టారు. ఇవన్నీ కూడా సిరిసిల్ల ప్రజలకు తెలుసునన్నారు.
మీరొచ్చి మీ నోటి దూల తీర్చుకునేందుకు ఏదైనా మాట్లాడుతాం. పైశాచికానందం పొందుతామంటే మీకు స్వాగతం.. శాసనసభలో ఆరోపణలు చేశారు.. 8 వేల ఎకరాలు మేం సిరిసిల్లలో కబ్జా చేశామన్నారు. ఆ 8 వేల ఎకరాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి.. ఎక్కడివి.. ఏ ఊరు.. సర్వే నంబర్లు ఎంత..? ఎవరు కబ్జా పెట్టారు..? ఎప్పుడు పెట్టారు..? మళ్లీ 2400 ఎకరాలు స్వాధీనం చేసుకున్నామన్నారు.. దీనిపై శ్వేతపత్రం ప్రచురించండి.. స్పష్టంగా పేర్లతో సహా బయటపెట్టండని కేటీఆర్ సవాలు విసిరారు.
సిరిసిల్లకి వచ్చి రాజన్నను దర్శించుకుని పాపప్రాప్తి చేసుకోవాలని రేవంత్ రెడ్డిని సూచిస్తున్నాను
సిరిసిల్లలో అభివృద్ధి ఎలా జరిగిందో చూసి కొడంగల్‌లో కూడా అదే తరహా అభివృద్ధి చేయాలని వస్తున్నాడేమో
అక్కడి ప్రజలకు ఏం చెప్తావు?
మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టిన వెధవను నేనే అని… https://t.co/XJ1Y1haNEU pic.twitter.com/ui4MmbDN8G
— Telugu Scribe (@TeluguScribe) September 21, 2026
Read Also :
Jagadish Reddy | పంటలను ఎండబెడుతున్న పాపం కాంగ్రెస్‌దే : ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
Project Cheetah | దేశంలో 8 నుంచి 52కు పెరిగిన చీతాల సంఖ్య.. ప్రాజెక్ట్ చీతా విజయవంతం
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Net | రెవెన్యూ రికార్డులో పేరును సరిదిద్దేందుకు లంచం డిమాండ్..ఏసీబీకి చిక్కిన జీపీవో
Supreme Court: చదువుకున్నవాళ్లు డిజిటల్ అరెస్టు ఎలా అవుతున్నారు.. సుప్రీంకోర్టు షాక్
కాంగ్రెస్ సర్కార్‌కు గ్రాడ్యూయేట్లు బుద్ధి చెప్పాలి : తక్కెళ్లపల్లి రవీందర్ రావు
BRS | కాసిపేటను కరువు మండలంగా ప్రకటించక పోతే ఆందోళనలు : బీఆర్ఎస్
ఆలయ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ భూమి పూజ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

