వీర్నపల్లి, సెప్టెంబర్ 03 : పంట పొలాల్లోని లూజ్ వైర్లు సరిచేసినంకనే గ్రామంలోకి రావలంటూ గ్రామస్తుడు కర్రతో దాడి చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్లలో బుధవారం జరిగింది. కరెంట్ బిల్లు నమోదు చేసేందుకు వెళ్లిన అసిస్టెంట్ హెల్పర్ శ్రీహరిని అదే గ్రామానికి చెందిన దూది రాజయ్య అడ్డుకున్నారు.
గ్రామంలో ఉన్న లూజ్ వైర్లు సరిచేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వాటిని సరిచేసిన తర్వాత బిల్లులు నమోదు చేయాలని మండిపడ్టారు. ఇద్దరి మధ్య వాగ్వాగం చోటుచేసుకోగా అసిస్టెంట్ హెల్పర్ శ్రీహరిపై కర్రతో రాజయ్య దాడి చేశాడు. దీంతో శ్రీహరిని స్ఖానికులు చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు.