సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 23: రాజన్న సిరిసిల్ల జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటలో పశువైద్యాధికారి పాముకు వైద్యం చేశాడు. అసలేం జరిగిందంటే.. కాటిపాముల కులానికి చెందిన ఓ వ్యక్తి ఇంట్లోకి మన్నుగున్న అనే పాము దూరింది. ఇంటి సజ్జపై నుండి గడ్డపార పాముపై పడడంతో దాని పొట్టలోంచి గాలి బ్లాడర్, పేగులు బయటకు వచ్చాయి.
తీవ్రంగా గాపడిన పాముకు సిరిసిల్లకు చెందిన పశువైద్యాధికారి అభిలాష్(Abhilash) చికిత్స అందించాడు. బయటకు వచ్చిన గాలి బ్లాడర్, పేగులను పాము పొట్టలోకి సర్ది చేసి ఆరు అంగుళాల పొడవున కుట్లు వేశాడు అభిలాష్. అనంతరం మూడు రోజులు అబ్జర్వేషన్లో ఉంచి దానికి చికిత్స అందించారు. ప్రస్తుతం పాము ఆరోగ్యంగా ఉన్నట్లు పశు వైద్యాధికారి తెలిపారు. గాయాల పాలైన పాముకు చికిత్స అందించిన అభిలాష్‌కు కాటిపాముల వ్యక్తి ధన్యవాదాలు చెప్పాడు.