సిరిసిల్ల టౌన్ : కేంద్ర మంత్రి బండి సంజయ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. రేవంత్ సంజయ్ ఇద్దరు చదువురాని వ్యక్తులు, ప్రెస్ మీట్ నిర్వహిస్తూ నీచమైన భాషను వినియోగిస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన నిలిచిందన్నారు. చార్ సౌ బీస్ హామీలతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. పావలా వంతు మంది రైతులకు కూడా రైతు భరోసా ఇవ్వలేదని విమర్శించారు. రైతులే కాంగ్రెస్ పార్టీకి సమాధి కడతారన్నారు.
కుల గణన పేరుతో బీసీలను చీటింగ్ చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. అగ్రవర్ణ కులాల జనాభా పెంచి బీసీల సంఖ్యను తగ్గించారని ఆరోపించారు. డిసెంబర్ 9 రోజున అన్ని ఇస్తామన్నారు ఒక్కటి ఇవ్వలేదు. లాస్ట్ కు రేవంత్ ప్రభుత్వం డిసెంబర్ 9 మునుగుతుందన్నారు. చదువురాని బండి సంజయ్ కూడా కేటీఆర్ గురించి తప్పుగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సంజయ్ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారని ప్రశ్నించారు. సిరిసిల్లలో మానసిక పరిస్థితి సరిగా లేని అధికారిని ముందర పెట్టుకొని నడిపిస్తున్నారు.
ఏ మాత్రం సంబంధం లేని వారిని అక్రమ కేసులలో పెట్టి బాధపెడుతున్నారు. హోటల్ నడుపుకునే బీదవారిని అని చూడకుండా వారి డబ్బాలు తీసివేయించారు. ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి ప్రజలకు సహాయం చెయ్యండి. కానీ వారిని అన్యాయంగా ఇబ్బంది పెట్టొద్దన్నారు. లవని పట్టా అనేది చాలా రోజుల కిందటి నుండే వస్తున్నాయి. ఇప్పుడు సిరిసిల్లలో ఎదో జరుగుతుంది అని రైతులను, నాయకులను జైలుకు పంపిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు.