రాజన్న సిరిసిల్ల : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకును ఓ తండ్రి రోకలిబండతో కొట్టి చంపాడు. ఈ విషాదరక సంఘటన జిల్లాలోని కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన గుర్రం బాలయ్య కొడుకు నిఖిల్ (22)ను అతని తండ్రి రోకలిబండతో కొట్టి చంపాడు.
నిఖిల్ ప్రతి రోజు మద్యం సేవించి వచ్చి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేసినట్లు సమాచారం. దీంతో విసిగిపోయిన తండ్రి నిఖిల్ తలపై రోకలి బండతో కొట్టి చంపాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.