అహ్మాదాబాద్: టీ20 వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో హైడ్రామా చోటుచేసుకున్నది. సూపర్ థ్రిల్లింగ్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో రెండు సార్లు సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. చివరకు దక్షిణాఫ్రికా రెండో సూపర్ ఓవర్లో 4 రన్స్ తేడాతో విక్టరీ నమోదు చేసింది. ఈ వరల్డ్‌కప్‌లో సూపర్ ఓవర్ వరకు వెళ్లిన తొలి మ్యాచ్ ఇదే. భారీ పవర్ హిట్టర్లు ఉన్న రెండు జట్లు.. మ్యాచ్‌పై చివరి వరకు తమ పట్టును కోల్పోలేదు. ఈ మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిసింది. ఫస్ట్ మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి 20 సిక్సర్లు కొట్టాయి. ఇక సూపర్ ఓవర్స్‌లో మరో 10 సిక్సర్లు బాదాయి. అహ్మాదాబాద్ స్టేడియం బౌండరీల మోతతో హోరెత్తింది.
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 187 రన్స్ చేసింది. క్వింటెన్ డికాక్ 59, రికల్టన్ 61 రన్స్ చేశారు. అయితే చేజింగ్ మొదలుపెట్టిన ఆఫ్ఘనిస్తాన్‌కు గుర్బాజ్ మంచి స్టార్ట్ ఇచ్చాడు. అతను 42 బంతుల్లో 84 రన్స్ చేశాడు. అజ్మతుల్లా, రషీద్ ఖాన్ కూడా చెలరేగిపోయారు. దీంతో మ్యాచ్ ఆఫ్ఘన్ గెలుస్తుందనుకున్నారు. కానీ ఆఖరి ఓవర్లో 13 రన్స్ అవసరం కాగా .. మ్యాచ్ టై అయ్యింది. 19.4 ఓవర్లలో 187 రన్స్ చేసి ఆఫ్ఘనిస్తాన్ ఆలౌటైంది. మ్యాచ్ టై కావడంతో సూపర్ ఓవర్‌కు వెళ్లింది.
ఇక ఫస్ట్ సూపర్ ఓవర్లో ముందుగా ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ చేసింది. ఆ ఓవర్లో 17 రన్స్ చేసింది ఆఫ్ఘనిస్తాన్. అజ్మతుల్లా 5 బంతుల్లో 16 రన్స్ చేశాడు. అయితే ఆ టార్గెట్‌ను అనూహ్య రీతిలో ఛేజ్ చేసింది దక్షిణాఫ్రికా. ఆఖరి బంతికి భారీ సిక్సర్ కొట్టిన స్టబ్స్ ఫస్ట్ సూపర్ ఓవర్‌ను తమ ఖాతాలో వేసుకున్నాడు.
రెండో సూపర్ ఓవర్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 23 రన్స్ చేసింది. స్టబ్స్ ఓ సిక్సర్ బాదగా, మిల్లర్ రెండు భారీ సిక్సర్లు కొట్టేశాడు. ఇక చేజింగ్‌లో గుర్బాజ్ వరుసగా మూడు సిక్సర్లు కొట్టి దక్షిణాఫ్రికాను వణికించాడు. కానీ ఆఖరి బంతికి క్యాచ్ అవుట్ కావడంతో 4 రన్స్ తేడాతో సఫారీలు విక్టరీ కొట్టారు.