బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో సిడ్నీ ( Sydney ) లో కేటీఆర్ జన్మదిన వేడుకలు ( KTR Birthday) ఘనంగా నిర్వహించారు. సిడ్నీ నగరంలో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా నాయకుడు రాజేష్ గిరి రాపోలు ( Rajesh Giri Rapole ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, కేటీఆర్ నాయకత్వాన్ని గుర్తు చేసుకుంటూ కేక్ కట్ చేశారు.
రాజేష్ గిరి రాపోలు మాట్లాడుతూ కేటీఆర్ రాజకీయ ప్రస్థానం ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ప్రజలతో మమేకమై, ఆధునిక తెలంగాణ నిర్మాణంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. యువ నాయకత్వానికి కేటీఆర్ ఒక ప్రేరణగా నిలిచారని, ఆయన మరింత ఉన్నత స్థానాలకు ఎదిగి తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటం, అనంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలకు ఎంతో గర్వకారణమని తెలిపారు.