Alternative Crops | ఎల్నినో ప్రభావం కారణంగా ప్రత్యామ్నయ పంటలు సాగు చేయాలి
Alternative Crops | ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల ప్రణాళిక రూపొందించు కోవాలని రాయపోల్ మండల ప్రత్యేక అధికారి బాబు నాయక్ సూచించారు.
రాయపోల్ : ఎల్నినో ( El Nino) ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని రాయపోల్ మండల ప్రత్యేక అధికారి బాబు నాయక్ ( Babu Naik ) సూచించారు.
సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని లింగారెడ్డి పల్లి, బేగంపేట్, వీరారెడ్డిపల్లి, , మంతూర్, అనాజిపుర్ , చిన్నమాసంపల్లి. కొత్తపల్లి గ్రామాల్లో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు.
వరికి బదులు జొన్న, సజ్జ, రాగులు, మొక్కజొన్న, కంది, పెసర, మినుము, నువ్వులు, వేరుశెనగ తదితర ప్రత్యామ్నాయ (ఐడి) పంటలను సాగు చేయడం వల్ల తక్కువ నీటితో మెరుగైన దిగుబడి సాధించవచ్చని రైతులకు వివరించారు.
ప్రభుత్వం అందిస్తున్న ఫార్మ్ పాండ్స్ సబ్సిడీ పథకాన్ని సద్వినియోగించుకోని వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా పంటలకు అవసరమైన సమయంలో జీవనాధార నీటిపారుదల (Life Saving Irrigation) అందించవచ్చని వెల్లడించారు. . కార్యక్రమాల్లో ఎంపీడీవో శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి ఆర్ నరేష్ ,ఏపీవో జనార్ధన్ ఆయా గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

