రామగిరి, జూలై 24 : సమాజంలోని అసమానతలపై, అంటరానితనంపై అక్షరంతో పోరాటం చేసిన కలం యోధుడు గుర్రం జాషువా సాహిత్యం చిరస్మరణీయమని తెలుగు ఉపాధ్యాయ శిక్షణ శిబిరం కోర్సు డైరెక్టర్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు మందుగుల సుశీల అన్నారు. శుక్రవారం నల్లగొండలోని డీవీఎం కళాశాలలో జరిగిన తెలుగు వృత్యంతర శిక్షణ శిబిరంలో మహాకవి గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయులు జాషువా పద్యాలు ఆలపించడం ద్వారా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విషయ నిపుణులు శీలం భద్రయ్య, డా.సాగర్ల సత్తయ్య, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.వెంకటేశం, డా.కనకటి రామకృష్ణ, పొడిచేటి శంకర్, సాహితీ మేఖల జిల్లా బాధ్యులు మద్దోజు సుధీర్ బాబు, కే.కిషన్, పి.వెంకులు, దొడ్డి రామమూర్తి, కట్ల మధుసూదన్, దాసోజు రవికుమార్, నాగమణి, అండాలు, శ్రీదేవి, ఝాన్సీ పాల్గొన్నారు.