తొగుట : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట తారకరామారావు (కేటీఆర్)కు తొగుట మండలం వెంకటరావుపేట గ్రామస్థులు వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్ పుట్టినరోజును పునస్కరించుకొని.. మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ పొలంలో మహిళలు వరి నారుతో “Happy Birthday KTR” అని రాసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్కు వెరైటీగా వరి నారుతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మహిళలు.. గులాబీ బాస్ కేసీఆర్ తన్నీరు హరీశ్ రావు దుబ్బకా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్లను కూడా నారుతో రాశారు. కేటీఆర్ హ్యాపీ బర్త్ డే.. ఆ కిందే KCR, THR, KPR అనే అక్షరాలను నారుతో పొలంలో రూపొందించి పార్టీ నాయకత్వంపై తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా జీడిపల్లి రాంరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి, యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. 50వ వసంతంలో అడుగుపెట్టిన గులాబీ వర్కింగ్ ప్రెసిడెంట్కు పార్టీ శ్రేణులు, గ్రామస్థులు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.