సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 29: తంగళ్లపల్లి మండలంలోని సర్పంచ్‌లు సోమవారం కేటీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు 11 ప్యాకేజీలోని కాలువల నిర్మాణం పూర్తి చేయాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, పరిహారం సైతం ఇవ్వాలని కేటీఆర్‌ను వారు కోరారు. సర్పంచ్ల అలా విన్నవించడమే ఆలస్యం వెంటనే ప్రభుత్వ సీఎస్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డిలతో కేటీఆర్ ఫోన్లో మాట్లాడి, సమస్యను వివరించారు.
తంగళ్లపల్లి మండల సర్పంచ్‌లు సమస్యను కేటీఆర్ దృష్టికి తీసుకురాగా.. ఆయన సీఎస్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌తో మాట్లాడి బాకీ పడిన బిల్లలు గురించి చెప్పారు. కాళేశ్వరం 11 ప్యాకేజిలో రంగనాయక సాగర్ నుంచి కాలువల నిర్మాణం కోసం భూ సేకరణ గతంలోనే చేశామని, అవార్డు స్టేజిలో ఉన్నాయని ఉత్తమ్‌కు కేటీఆర్ తెలిపారు. ఇల్లంతకుంట మండలం దాచారం లో 10.03 ఎకరాలు, తంగళ్లపల్లి మండలంలోని నర్సింహులపల్లెలో 1.03 ఎకరాలు, బస్వాపూర్‌లో
1.21 ఎకరాలు, బద్దెనపల్లిలో 11.38 ఎకరాలు, జిల్లెల్లలో 3.35 ఎకరాలు, ముస్తాబాద్ మండలంలోని 21 గుంటలకు రూ.3.19కోట్లు విడుదల చేయాల్సి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్కొన్నారు. ఈ భూసేకరణ బిల్లులు సిద్దిపేట ఎపీఎవో శ్రద్ద ఉన్నాయని, తక్షణమే నిధులు విడుదల చేసి, కాలువల నిర్మాణం పూర్తి చేసి, రైతులకు నీళ్లు అందివ్వాలని కేటీఆర్ కోరారు. అందుకు సీఎస్, మంత్రి ఉత్తమక్కుమార్ రెడ్డిలు సానుకూలంగా స్పందించారని కేటీఆర్ తెలిపారు. అనంతరం కేటీఆర్‌కు తంగళ్లపల్లి సర్పంచ్‌లు కృతజ్ఞతలు తెలిపారు.
నూతనంగా ఎన్నికైన తంగళపల్లి సర్పంచ్ ఫోరం ఆధ్యక్షుడు పుర్మాణి రాజశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బాలసాని పర్శరాములుగౌడ్, సర్పంచ్ల ను కేటీఆర్ అభినందించి, శాలువాలతో సన్మానం చేశారు. వీరి వెంట సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా సర్పంచ్ ఫోరం మాజీ అధ్యక్షుడు మాట్ల మధు, మాజీ మండలాధ్యక్షుడు వలకొండ వేణుగోపాల్ రావు, మాజీ ఎంపీటీసీ పుర్మాణి కనకలక్ష్మి, లక్ష్మారెడ్డి, పుర్మాణి శ్రీనివాస్ రెడ్డి, వెల్పుల రాజు, శ్యాగ దేవందర్ యాదవ్, అవదూత మహేందర్, సిలువేరి చిరంజీవి, మోతే మహేష్ యాదవ్, మందాటి తిరుపతి యాదవ్, చీనుల ప్రశాంత్, గుండు ప్రేమ్ కుమార్, ఎల్లయ్య, తదితరులు ఉన్నారు.