Sircilla SP | డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలిద్దాం.. భావితరాలకు మంచి భవిష్యత్తుని అందిద్దాం.. సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బి.గితే పిలుపు
Sircilla SP | డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి. గితే పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా శనివారం సిరిసిల్లలో నిర్వహించిన 2K రన్లో విద్యార్థులు, క్రీడాకారులతో కలిసి పాల్గొన్నారు.
Sircilla SP | సిరిసిల్ల టౌన్, మే 2: డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బి. గితే పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా శనివారం సిరిసిల్లలో నిర్వహించిన 2K రన్లో విద్యార్థులు, క్రీడాకారులతో కలిసి పాల్గొన్నారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. డ్రగ్స్, గంజాయి నిర్ములన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి పౌరుడూ బాధ్యతగల వారిగా వ్యవహరించి, డ్రగ్స్ రహిత తెలంగాణగా మార్చడంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి పక్కా ప్రణాళికతో చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ వినియోగం వల్ల మెదడు, కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు, ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుందని చెప్పారు. అలాగే డ్రగ్స్ వినియోగం శారీరక నష్టాలకే పరిమితం కాకుండా మానసిక సమస్యలు, సామాజిక రుగ్మతలను కూడా పెంచుతుందని వివరించారు.
ప్రతి విద్యార్థి , యువత యాంటీ డ్రగ్ సోల్జర్ గా మారి మాదకద్రవ్యాల వల్ల వచ్చే అనార్థాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలలని సూచించారు. మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో నెంబర్ 8712671111 కి లేదా పోలీస్ వారికి సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

