రుద్రంగి, సెప్టెంబర్ 4: సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా గణేష్ నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని రుద్రంగి ఎస్ఐ శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని గణేష్ మండలి నిర్వాహకులు, యువకులతో ఎస్సై శ్రీనివాస్ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ నిమజ్జన సమయంలో అసాంఘిక కార్యక్రమాలకు, మతపరమైన ఘర్షణలకు పాల్పడవద్దని అన్నారు.
మండలంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా వినయక నిమజ్జన వేడుకలు జరుపుకోవాలని సూచించారు. డీజీలకు అనుమతి లేదని, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు. ఈ కార్యక్రమంలో గణేష్ మండలి నిర్వాహకులు, నాయకులు, పోలీసు సిబ్బంది, యువకులతో పాటు తదితరులు పాల్గొన్నారు.