షాద్‌నగర్‌రూరల్, ఏప్రిల్ 25 : తెలంగాణ సర్కార్ విద్యకు పెద్దపీట వేస్తూ సంపూర్ణ అక్షరాస్యత సాధనకు కృషి చేస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండలంలోని మొగిలిగిద్ద జూనియర్ కశాశాలలో సోమవారం నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రభుత్వం విద్యావ్యవస్థను మరింత పటిష్ట పరిచేందుకు మన ఊరు – మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులను సమకూర్చి విద్యార్థుల భవిష్యత్‌కు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కళాశాలలో దాతల సహకారంతో మధ్యాహ్న భోజనం అమలు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఖాజా ఇద్రీస్ అహ్మద్, వెంకట్రావ్, శ్యామ్, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
దైవ చింతనతో మానసిక ప్రశాంతత
కొందుర్గు, ఏప్రిల్ 25: దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం కొందుర్గు మండల కేంద్రంలో నిర్వహించిన బీరప్ప జాతరలో పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలకు భక్తి భావన ఉండడం వల్లనే గ్రామాలు సుభిక్షంగా ఉన్నాయన్నారు. గ్రామాల్లో నిర్మిస్తున్న దేవాలయాలకు సహకారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. బీరప్ప దేవాలయ అభివృద్ధికి రూ.లక్షా50వేలు విరాళంగా ఇచ్చారు.
అనంతరం జిల్లెడు చౌదరిగూడ మండలంలోని చౌదరిగూడ గ్రామానికి చెందిన ప్రభుకుమార్‌కు రూ.60వేల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఆయన వెంట వైస్ ఎంపీపీ రాజేశ్‌పటేల్, సర్పంచ్ ఆదిలక్ష్మీ యాదయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, యాదగిరి, గోపాల్, చందు, ఎదిర రామకృష్ణ, దర్గా రాంచంద్రయ్య ఉన్నారు.