సిరిసిల్ల రూరల్, మార్చి 19: తెలంగాణ జాగృతిని మరింతగా బలోపేతం చేస్తామని తంగళ్లపల్లి మండల జాగృతి అధ్యక్షుడు కందుకూరి రామాగౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మండల, గ్రామాల వారీగా కమిటీలు వేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి తంగళ్లపల్లి పట్టణ నూతన కమిటీని నియమించామన్నారు. బీసీ బిల్లును ఆమోదించడంతో పాటు పార్లమెంట్ లో సైతం బిల్లు ఆమోదించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు.
మహిళలకు బస్సు సౌకర్యం కల్పించడంతో సరిపోదని ఇచ్చిన హామీలను, మహాలక్ష్మి పథకాన్ని పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం మండల ప్రధాన కార్యదర్శి నేరెళ్ల అనిల్ గౌడ్, జాగృతి పట్టణ అధ్యక్షులు వెంకట రంగం, ఉపాధ్యక్షులు తిరుణహరి భానుమూర్తి, నాయకులు వెంగళ రమేష్, సద్దా మనోహర్, పసుల దుర్గయ్య పాల్గొన్నారు.