జోరు తగ్గని కారు
కేసీఆర్ మళ్లీ సీఎం రావాలని ప్రజలు కోరుకుంటున్నారనేది మున్సిపల్ ఎన్నికల్లో నిరూపితమైంది. అంతకుముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆదరించిన జనం.
- రెండు మున్సిపాలిటీల్లో మ్యాజిక్ ఫిగర్ చేరుకోని హస్తం పార్టీ
- సీఎం వరాల జల్లు కురిపించినా నమ్మని జిల్లా ఓటర్లు
వికారాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ మళ్లీ సీఎం రావాలని ప్రజలు కోరుకుంటున్నారనేది మున్సిపల్ ఎన్నికల్లో నిరూపితమైంది. అంతకుముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆదరించిన జనం.. ఈ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ వైపే నిలవడం గమనార్హం. అన్ని వర్గాల మద్దతుతో ‘గులాబీ’ గుబాళించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాం గ్రెస్ పార్టీ నాలుగు మున్సిపాలిటీల్లోనూ ఎన్ని కుట్రలు చేసినా జనం మాత్రం ఆదరించలేదు. బీఆర్ఎస్కు వచ్చిన ఓటింగ్ శాతాన్ని చూస్తే అన్ని వర్గాల ప్రజలు మార్పును కోరుకుంటున్నారనేది స్పష్టంగా అర్థమవుతున్నది.
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కు 37.11 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 45.71 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. వికారాబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి 31.84శాతం, కాంగ్రెస్‌కు 43%, బీజేపీకి 13.36%, ఎంఐఎంకు 5.95%, తాండూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు-37.38%, కాం గ్రెస్‌కు-40.01%, బీజేపీకి-5.492%, ఎంఐఎంకు-6.21%, పరిగి మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు-40.66%, కాంగ్రెస్‌కు-43.39%, బీజేపీకు-8.46 శాతం ఓటింగ్ నమోదైంది. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో కలిపి బీఆర్ఎస్కు 42,129 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 51,899., బీజేపీకి 12,791 ., ఎంఐఎంకు 5536, ఇతరులకు 6696 ఓట్లు పోలయ్యాయి. జిల్లాలోని ఏ మున్సిపాలిటీలో వచ్చిన ఓటింగ్ శాతాన్ని చూసినా అధికార పా ర్టీకి బీఆర్ఎస్కు కేవలం స్వల్ప తేడా మాత్రమే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టు కుని దౌర్జన్యాలు, కుట్రలు చేయడంతో ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారన్నది ఓటింగ్ శాతాన్ని చూస్తే స్పష్టంగా అర్థమవుతున్నది. సీఎం సొంత నియోజకవర్గంలోని కొడంగల్ మున్సిపాలిటీ మినహా మిగతా వికారాబాద్, తాండూరు, పరిగి మున్సిపాలిటీల్లో చావు తప్పి కన్ను లొట్టపోయిందనేలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తయారైంది.
వరాలు కురిపించినా..
జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డి పరిగి నియోజకవర్గంలో ప్రజాపాలన పేరిట బహిరంగ సభ పెట్టి తాండూరు మున్సిపాలిటీకి రూ. వెయ్యి కోట్లు, పరిగికి సాగునీరు తీసుకొస్తా మని.. వికారాబాద్‌ను టూరిజం హబ్‌గా మారుస్తామంటూ వరాలు కురిపించినా ప్రజలు మాత్రం విశ్వసించలేదు. పరిగి మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడగా.. వికారాబాద్ మున్సిపాలిటీలో మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోలేకపోయారు. తాండూరు మున్సిపాలిటీకి రూ. వెయ్యి కోట్ల నిధులు, మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనే జీ, తాండూరు మున్సిపాలిటీకి కాగ్నా నుంచి తాగునీటి సరఫరా చేస్తామని ప్రకటించినా కాం గ్రెస్‌కు మ్యాజిక్ ఫిగర్‌కు కావాల్సిన స్థానాలు మాత్రమే వచ్చాయి.
వికారాబాద్ మున్సిపాలిటీలో స్పీకర్ తన కుమార్తెను మున్సిపల్ చైర్పర్సన్ చేసేందుకు అన్ని విధాలా యత్నించినా మ్యాజిక్ ఫిగర్‌ను చేరకోలేకపోయారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రలోభాలకు పాల్పడ్డారు. మరోవైపు గత మున్సిపల్ ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభంజనానికి కాంగ్రెస్ పార్టీ నాలుగు మున్సిపాలిటీల్లోనూ సింగిల్ డిజిట్ స్థానాలకే పరిమితం కాగా.. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కొడంగల్ మినహా మిగతా మూడు మున్సిపాలిటీల్లోనూ అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టించి గెలిచినంత పనిచేసింది.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Python | చేపల వలలో చిక్కిన ఈ భారీ కొండచిలువను చూశారా..?
Varun Tej | నితిన్ అనుకున్న కథ వరుణ్ తేజ్ చేతికి.. ‘ఆయ్’ డైరెక్టర్‌తో మెగా హీరో సినిమా?
UPI fee | రూ.2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు.. దివాళి తర్వాత అమలు
Aadi Saikumar | శంబాల హిట్.. మరో మిస్టిక్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు ఆది సాయికుమార్!
Beauty Tips | తరచూ నెయ్యితో మర్దన చేస్తే జుట్టు బాగా పెరుగుతుందా..?
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

