యాచారం, ఆగస్టు 12 : ఫార్మాసిటీ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సేకరించిన భూములపై టీజీఐఐసీ ప్రత్యేక ని ఘా పెట్టింది. కోర్టు స్టే ఉన్నప్పటికీ న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరిస్తూ భూములను స్వాధీనం చేసుకోవడమే గాక అటువైపు రై తులు, వ్యవసాయ కూలీలెవరూ రాకుం డా, ఎలాంటి పంటలు సాగుచేయకుండా అడ్డుకుంటున్నది. ఇందుకోసం 500 ఎకరాలకొకటి చొప్పున 28 కంటెయినర్లు ఏ ర్పాటుచేశారు. రాత్రీపగలూ పహారా కా సేందుకు ఒక్కో కంటెయినర్‌కు ఆరుగురు చొప్పున 168 మంది సిబ్బందిని కూడా మోహరించారు. అంతేగాక అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తీరుపై అటు రైతులు, ఇటు ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాచారం, కందుకూరు మండలాల్లో 13,500 ఎకరాల భూమిని సేకరించింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంగా మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో సేకరించిన అసైన్డ్, పట్టా భూములను స్వాధీనం చేసుకునేందుకు పోలీసుల పహారాతో టీజీఐఐసీ అధికారులు చుట్టూ ఫెన్సింగ్ వేయించారు. ఇందులో ఫార్మాకు ఇవ్వని 2,250 ఎకరాల భూములకు మినహాయింపు ఇచ్చిం ది. ఈ వానకాలం నుంచే రైతులు పంటలు వేయకుండా ప్రభుత్వం అడ్డుకున్నది.
ఇ ప్పటికే ఈ భూములపై వ్యవసాయ కూ లీలు భూములు కోల్పోవడంతో తమ ఉపాధిని కోల్పోతున్నామని, తమకు పునరావాసం కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టే ఆర్డర్‌ను ధిక్కరిస్తూ ఇటీవల అధికారులు పోలీసులు భూములను స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ, పోలీ సు, టీజీఐఐసీ అధికారులు కలిసి రైతులు వేసిన పంటలను బుల్డోజర్లతో ధ్వంసం చేశారు. రైతుల పొలాల్లో ఉన్న పశువుల కొట్టాలు, బోరు బావులు, కోళ్ల ఫారాలను సైతం నేలమట్టం చేశారు. అడ్డుకున్న రైతులను అరెస్టు చేశారు. చివరగా భూములపై ప్రత్యేక నిఘా ఉంచేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే సేకరించిన భూములను త్వరలోనే వివిధ కంపెనీలకు అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని సమాచారం. దీని కోసమే భూములపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు అధికారులు చెప్తున్నారు.
పునరావాసం కల్పించేవరకు భూములను స్వాధీనం చేసుకోవ ద్దని, ఎలాంటి అభివృద్ధి పనులను చేపట్టవద్దని, ఆ భూముల్లో కూ లీలు పంటలు సాగు చేసుకొని బతుకవచ్చని కోర్టు స్టే ఇచ్చింది. కా నీ కోర్టు ఆర్డర్‌ను ధిక్కరిస్తూ టీజీఐఐసీ, రెవెన్యూ అధికారులు, పో లీసులు భూములను స్వాధీనం చేసుకోవడం తగదు. పునరావా సం కల్పించేవరకు ఫార్మా భూముల్లో ఎలాంటి పనులు చేపట్టవ ద్దు. దీనిపై కమిటీ ఆధ్వర్యంలో త్వరలో మరో పోరాటానికి సిద్ధమవుతాం.
-కవుల సరస్వతి, ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ నాయకురాలు