సిరిసిల్ల రూరల్, మార్చి 12: జిల్లాలో లేడీ అఘోరీ రానున్నడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. వేములవాడలోని రాజన్న ఆలయాన్ని మరోసారి దర్శించుకోవడానికి లేడీ అఘోరి రానున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఇటీవలే రాజన్న ఆలయంలోని దర్గాను కూల్చివేస్తానంటూ జిల్లాకు రాగా, అఘోరిని జిల్లా సరిహద్దు చెక్పోస్ట్ వద్దనే పోలీసులు అడ్డుకొని తిప్పి పంపిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బుధవారం లేడీ అఘోరి మళ్లీ వేములవాడ దర్శనానికి వస్తున్నట్లు సమాచారం అందడంతో జిల్లెల్ల చెక్ పోస్ట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమ తించారు. సాయంత్రం లేడి అఘోరీ రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా లేడి అఘోరి పోలీసులతో వాగ్వాదానికి దిగింది. కారు దిగి హల్ చల్ చేసింది. మహిళా పోలీసులు అతికష్టం మీద అక్కడ నుంచి తిరిగి పంపించారు.